పొన్నూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నరేంద్ర కుమార్

రిపోర్టర్: గోపి స్థలం: గుంటూరు

పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు గ్రామంలో పల్లెపండుగ మూడో విడత కార్యక్రమంలో భాగంగా గ్రామ అభివృద్ధి నిధులతో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ - ఎమ్మెల్యే పొన్నూరు శంకుస్థాపన చేశారు. అనంతరం తొంబై శాతం గ్రామీణ నిధులు మరియు పది శాతం లబ్ధిదారుల వాటాతో రెండు లక్షల రూపాయల వ్యయంతో మినీ గోకులం షెడ్డు నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు మరియు నాయకులు పాల్గొన్నారు.