టెక్నికల్ విద్య బలోపేతానికి ఏఐసీటీఈ కీలక నిర్ణయం: నాలుగు కొత్త పథకాలు
రిపోర్టర్: గోపి
స్థలం: న్యూఢిల్లీ
దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అఖిల భారత సాంకేతిక విద్యామండలి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగు నూతన పథకాలను ప్రారంభించినట్లు చైర్మన్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ వెల్లడించారు. ప్రయోగశాలల ఆధునికీకరణ, మౌలిక వసతుల మెరుగుదల మరియు విద్యాపరమైన మార్గదర్శకత్వం అందించడమే ఈ సరికొత్త కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఐడియా ల్యాబ్, మోడ్రాబ్స్, మార్గదర్శన్ తో పాటు సదస్సుల నిర్వహణ కోసం ప్రత్యేక గ్రాంట్లు అందజేస్తామని తెలిపారు.