ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు: లలితాదేవిగా అమ్మవారి అలంకరణ

రిపోర్టర్: సతీష్ స్థలం: విజయవాడ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని, ఐదో రోజున అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారని ఆలయ అధికారులు తెలిపారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రేపు మూలా నక్షత్రం సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు, త్రిదండి చిన్న జీయర్ స్వామి తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.