రామాయణం సినిమా సంగీతంపై వివాదం: ఏఆర్ రెహమాన్ ఘాటు స్పందన
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పౌరాణిక చిత్రం రామాయణం సినిమా సంగీతంపై వస్తున్న విమర్శలపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తాజాగా స్పందించారు. అందరినీ సంతృప్తిపరచాలని చూస్తే ఐస్ క్రీమ్ అమ్ముకోవాలని ఆయన తేల్చిచెప్పారు. ఈ చిత్రంలోని పాటలపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయగా, తన సృజనాత్మక ప్రక్రియపై వస్తున్న ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ పై దర్శకులు, సంగీత దర్శకులు తీవ్రంగా స్పందిస్తూ వస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.