గదగను కరవు ప్రాంతంగా ప్రకటించాలని మంత్రి హెచ్ కే పాటిల్ డిమాండ్

రిపోర్టర్: రాము స్థలం: Bengaluru

కర్ణాటకలోని గదగ జిల్లాను వెంటనే కరవు ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు ఆ రాష్ట్ర మంత్రి హెచ్ కే పాటిల్ వెల్లడించారు. అయితే కొందరు అధికారులు ఈ విషయాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటూ రైతులను మోసం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, రైతులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.