మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తి: నవంబర్ మూడున ఓట్ల లెక్కింపు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీలకు నిర్వహించిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. కొన్ని ప్రాంతాల్ లో చెదురుమదురు సంఘటనలు మినహా అంతటా ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.