తీవ్ర అలర్ట్: ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో సోమవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద ఉండరాదని హెచ్చరించింది.