నేపాల్ వరదల్లో 275 మంది భారతీయులు గల్లంతు: విదేశాంగ శాఖ

రిపోర్టర్: మహేష్ స్థలం: World

నేపాల్ వరదల్లో సుమారు 1,295 మంది మరణించగా, 275 మంది భారతీయులు గల్లంతయ్యారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఇప్పటివరకు 166 మంది భారతీయులను రక్షించామని, సహాయక చర్యల కోసం 95 టన్నుల సామగ్రితో 7 విమానాలను పంపామని తెలిపారు. టిబెట్ ప్రాంతంలో ఎవరూ చిక్కుకోలేదని స్పష్టం చేస్తూ, నేపాల్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని పేర్కొన్నారు.