టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్లో పాల్గొన్న జేబీ శ్రీనివాస్
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి అర్బన్
టీడీపీ ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కాంక్లేవ్ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్తో పాటు సత్యవేడు నియోజకవర్గం ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ఉత్సాహంగా పాల్గొన్నారు.
పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. కార్యకర్తలను సమాయత్తం చేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.