విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు ఏపీడీజీవెరిఫై పోర్టల్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమరావతి
విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనను సులభతరం చేసేందుకు ఏపీడీజీవెరిఫై పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. పాత రికార్డులతో సహా అన్ని రకాల ధ్రువపత్రాలను ఈ పోర్టల్‌లో భద్రపరిచినట్లు వెల్లడించారు. డేటా భద్రత కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, పాలిటెక్నిక్ సర్టిఫికెట్లతో పాటు సదరం ధ్రువపత్రాలను ఇందులో పొందుపరిచామని, క్యూఆర్ కోడ్ విధానాన్ని కూడా అమలు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.