వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో నిందితులను విచారించిన పోలీసులు
రిపోర్టర్: సునీల్
స్థలం: రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరంలో ప్రియాంక అనే పీజీ వైద్య విద్యార్థిని ఘోర కారు ప్రమాదంలో మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కారు నడిపి ఆమె మృతికి కారణమైన నిందితులు సురవరపు దస్వంత్, దేశాబత్తుల ఆండ్రూ జోసెఫ్లను పోలీసులు బుధవారం కస్టడీకి తీసుకున్నారు. బొమ్మూరు పోలీస్స్టేషన్లో ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ వీరిని సమగ్రంగా విచారించారు. గత నెల ప్రసాదిత్య మాల్ వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టగా చికిత్స పొందుతూ ప్రియాంక మృతిచెందారు. సెక్యూరిటీ భయంతోనే వేగంగా వెళ్లినట్లు నిందితులు విచారణలో పోలీసులకి స్పష్టం చేశారు.