నాకు ఎక్కువ ఐక్యూ ఉంది: ట్రంప్ ఏఐ వ్యాఖ్యలపై ట్రోల్స్

రిపోర్టర్: రాము స్థలం: World

అమెరికాకు కఠినమైన ఏఐ నిబంధనలు అవసరం లేదని, దేశానికి బలమైన, అత్యధిక ఐక్యూ ఉన్న అధ్యక్షుడు ఉన్నారంటూ డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మానవాళికి ముప్పు అనే వాదనలను ఆయన కొట్టిపారేశారు. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నెటిజన్లు ఆయన అతివిశ్వాసాన్ని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.