ఆసి క్రీడల్లో సెమీఫైనల్స్ దూసుకెళ్లిన వుషు క్రీడాకారిణి రోషిబినా దేవి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ఇండియా
ఆసియన్ క్రీడల మహిళల 60 కేజీల వుషు సాండ విభాగంలో భారత క్రీడాకారిణి నౌరమ్ రోషిబినా దేవి సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్లో మకావుకు చెందిన చు మాన్ సిన్‌పై 5-0 తేడాతో విజయం సాధించి, కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నారు. తొలుత సెలెక్షన్ ట్రయల్స్‌లో ఓడినప్పటికీ, దివ్యాంశీ చౌదరికి గాయం కావడంతో ఆమె స్థానంలో జట్టులోకి వచ్చిన రోషిబినా ఈ అద్భుత ప్రదర్శనతో పతకంపై ఆశలు రేకెత్తించారు.