నర్సీపట్నంలో సంక్షేమ పథకాలే గెలిపిస్తాయంటూ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ విస్తృత ప్రచారం
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పదకొండో వార్డులో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ విస్తృతంగా పర్యటించారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బరిలో నిలిచిన చింతకాయల అనితతో పాటు ఇతర అభ్యర్థుల విజయానికి ఓటర్లను అభ్యర్థించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.