హఫీజ్‌పేటలో మహిళపై దాడి చేసిన హోంగార్డు సర్వీస్ నుండి తొలగింపు

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని హఫీజ్‌పేటలో మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన హోంగార్డు ఘటనపై డీజీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. మహిళ అని చూడకుండా జుట్టుపట్టుకుని లాక్కెళ్లిన ఈ అమానుష ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. నిందితుడి ప్రవర్తన క్షమించరానిదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అతడిని సర్వీస్ నుండి వెంటనే తొలగించాలని మరియు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను డీజీపీ ఆదేశించారు.