జాతీయ రహదారిపై బోల్తా పడిన డీసీఎం వాహనం
రిపోర్టర్: సురేష్
స్థలం: నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై డీసీఎం వాహనం బోల్తా పడింది. వంతెన మరమ్మతుల కారణంగా ఒకవైపు నుంచి వాహనాలు అనుమతిస్తుండగా, అతివేగంగా వచ్చిన డీసీఎం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై వాహనం పడటంతో గంటపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.