ఇట్లు అర్జున సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించిన నాగార్జున

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

యువ నటుడు అనీష్ మరియు అనస్వర రాజన్ జంటగా మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇట్లు అర్జున చిత్రం నవంబర్ పదమూడవ తేదీన థియేటర్లలో విడుదల కానుందని అక్కినేని నాగార్జున వెల్లడించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ యువ జట్టుపై తనకు పూర్తి నమ్మకం ఉందని నాగార్జున పేర్కొన్నారు.