నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన షెడ్యూల్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వింజమూరు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. కొత్తగా నిర్మించిన బీటీ రోడ్డును పరిశీలించడంతో పాటు ఉపాధి హామీ కార్మికులతో కలిసి శ్రమదానం కార్యక్రమంలో సీఎం భాగస్వాములు కానున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.