కోనసీమ గ్రౌండ్ రెంట్ భూ సమస్యపై నేడు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దశాబ్దాలుగా వేధిస్తున్న గ్రౌండ్ రెంట్ స్థలాల సమస్యకు సీఎం చంద్రబాబు పర్యటనతో తెరపడనుంది. ఇవాళ జిల్లాలో పర్యటించనున్న ఆయన, 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న నివాస గ్రౌండ్ రెంట్ భూములకు విముక్తి కల్పించేలా కీలక ప్రకటన చేయనున్నారు. ఈ నిర్ణయం అమలైతే వేలాది మందికి మేలు జరగడంతో పాటు ఆస్తి లావాదేవీల ఇబ్బందులు తొలగిపోనున్నాయి.