క్రీడా ప్రపంచంలో అత్యధిక సంపాదనలో మైఖేల్ జోర్డాన్ మరియు టైగర్ వుడ్స్ టాప్
రిపోర్టర్: మహేష్
స్థలం: World
క్రీడలకు దూరంగా ఉన్నప్పటికీ మైఖేల్ జోర్డాన్, టైగర్ వుడ్స్ అత్యధిక సంపాదన కలిగిన క్రీడాకారుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. స్పోర్టికో తాజా నివేదిక ప్రకారం జోర్డాన్ 4.5 బిలియన్ డాలర్లతో ప్రథమ స్థానంలో ఉండగా, టైగర్ వుడ్స్ 2.88 బిలియన్ డాలర్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. క్రిస్టియానో రొనాల్డో, లీబోన్ జేమ్స్ వంటి ప్రస్తుత స్టార్ ఆటగాళ్లు సైతం వీరిద్దరి కంటే వెనుకబడి ఉన్నారు.