గ్లోబల్ చెస్ లీగ్ కోసం ఆల్పైన్ పైపర్స్ భారీ వ్యూహం
రిపోర్టర్: రమేష్
స్థలం: Bengaluru
బెంగళూరు వేదికగా ప్రారంభం కానున్న గ్లోబల్ చెస్ లీగ్ (GCL) సీజన్ 4లో టైటిల్ నిలబెట్టుకోవడానికి ఆల్పైన్ పైపర్స్ సిద్ధమైంది. మాగ్నస్ కార్ల్సన్, విదిత్ గుజరాతి, కోనేరు హంపి వంటి దిగ్గజాలతో కూడిన అత్యంత బలమైన జట్టును కోచ్ ప్రవీణ్ తిప్సే రూపొందించారు. డ్రాఫ్ట్ పద్ధతిలో ఎలో రేటింగ్ ఆధారంగా అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేశామని, టైటిల్ వేటలో తమ వ్యూహం స్పష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు.