ప్రధాని మోదీకి మగ్గంపై తల్లి ఆశీస్సుల అద్భుత కానుక
రిపోర్టర్: నరేష్
స్థలం: ఉత్తర ప్రదేశ్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన చేనేత కళాకారుడు సర్వేశ్ కుమార్ శ్రీవాస్తవ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించారు. ప్రాచీన ఉచంద్ కళా పద్ధతిలో స్వచ్ఛమైన పట్టు వస్త్రంపై మోదీని ఆయన తల్లి హీరాబెన్ ఆశీర్వదిస్తున్న దృశ్యాన్ని చేతితో అందంగా తీర్చిదిద్దారు. ఎలాంటి యంత్రాలు ఉపయోగించకుండా నెలన్నర రోజులు శ్రమించి ఈ అపురూప చిత్రాన్ని తయారు చేశారు.