నిరుద్యోగులకు గుడ్ న్యూస్: రైల్వే స్టేషన్ మాస్టర్ నియామకాల్లో కీలక మార్పులు

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలక మార్పులు తీసుకువచ్చినట్లు రైల్వే బోర్డ్ అధికారులు వెల్లడించారు. తాజా విధానం ప్రకారం రెండు పరీక్షలకు బదులుగా కేవలం ఒకే కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే సిలబస్లోనూ గణనీయమైన మార్పులు చేసినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ మరింత సులభతరం కానుందని, రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.