కోర్టు భవన నిర్మాణ నిధుల కోసం ఎమ్మెల్యేను కలిసిన న్యాయవాదులు

రిపోర్టర్: Anjaneyulu Yadav స్థలం: కల్వకుర్తి

కల్వకుర్తి నియోజకవర్గంలో నూతన అడిషనల్ కోర్టు భవన నిర్మాణానికి తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరుతూ బార్ అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్లో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రజా సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, భవన నిర్మాణ పనులకు త్వరలోనే అవసరమైన నిధులు కేటాయించేలా తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చినట్లు న్యాయవాదులు వెల్లడించారు.