నెల్లూరులో దశాబ్దాలుగా కొనసాగుతున్న సైరన్ సంప్రదాయం: వ్యవసాయ కార్మికులకు మేలుకొలుపు

రిపోర్టర్: వెంకట్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో వ్యవసాయ కార్మికులను మేలుకొల్పేందుకు ఏర్పాటు చేసిన సైరన్ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. పెన్నా నదీ జలాల ఆధారంగా సాగయ్యే వేలాది ఎకరాల పంటల కోసం 1960ల ప్రారంభంలో నాటి సర్పంచి దొడ్ల అన్నారెడ్డి ఈ వ్యవస్థను తెచ్చారని స్థానికులు తెలిపారు. నగర పంచాయతీగా మారిన తర్వాత కూడా రోజులో ఆరుసార్లు ఈ పెద్ద శబ్దంతో కూడిన సైరన్ మోగించడం విశేషం.