కోవూరులో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో 61 మంది లబ్ధిదారులకు రూ.44 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని దామరమడుగులో వి.పి.ఆర్ నేత్ర కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోందని ఆమె తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.