వినాయక చవితికి బాక్సాఫీస్ వద్ద ఐదు కొత్త సినిమాల సందడి
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10, 11 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో ఐదు కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సర్దార్ 2, ఎపిక్, మారెమ్మ, మండాడి, మహేంద్రగిరి వారాహి చిత్రాలు రిలీజ్ కానుండటంతో థియేటర్లలో సందడి నెలకొంది. వీటిలో మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాగా, రెండు డబ్బింగ్ చిత్రాలు ఉన్నాయి. కంటెంట్ ఆధారంగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది.