వాయుసేన నూతన అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
రిపోర్టర్: గోపి
స్థలం: New Delhi
భారత వాయుసేన నూతన అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ కీలక ప్రాధాన్యాలను వెల్లడించారు. ఫైటర్ స్క్వాడ్రన్ల సంఖ్యను పునరుద్ధరించడం, ఆయుధ వ్యవస్థల పరంగా స్వావలంబన సాధించడం తన ప్రధాన లక్ష్యాలని ఆయన స్పష్టం చేశారు. దేశ రక్షణ విషయంలో వాయుసేన ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తామని ఆయన ఆదివారం పేర్కొన్నారు.