స్థానిక సంస్థల ఎన్నికల్ లో ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని తెలుగు దేశం పార్టీ పిలుపు

రిపోర్టర్: విజయ్ స్థలం: Andhra Pradesh

అభివృద్ధి మరియు సంక్షేమం నిరంతరం కొనసాగాలంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో భారీ తేడాతో గెలిపించాలని తెలుగు దేశం పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు అధికారిక సామాజిక మాధ్యమ వేదికగా స్పందించిన ఆ పార్టీ, తాము చెప్పిన విధంగానే ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని స్పష్టం చేసింది. ఏపీలో జరుగుతున్న సంక్షేమ ఫలాలు ప్రతి గడపకూ చేరాలంటే స్థానిక, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్ లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రజలు పనిచేయాలని కోరింది.