ఏలూరు జిల్లాలో దారుణం: వివాహానికి అడ్డొస్తోందని ప్రియురాలను హతమార్చిన యువకుడు అరెస్ట్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఏలూరు

వివాహానికి అడ్డొస్తోందనే కక్షతో ప్రియురాలను అతి దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన ఘటనలో నిందితుడిని ఏలూరు జిల్లా చేబ్రోలు పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రావణ్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. ఉంగుటూరు మండలం రాపులపర్రుకి చెందిన గండికోట అజయ్కుమార్ అనే యువకుడు సంధ్యారాణిని హత్య చేసి మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.