రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా ప్రజలకు, ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతి, ప్రకృతి ఆరాధనకు బతుకమ్మ నిలువెత్తు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ పూల పండుగ ప్రతి ఇంటా ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు.