అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటీలోకి కార్తీ సర్దార్ 2 చిత్రం
రిపోర్టర్: సురేష్
స్థలం: చెన్నై
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2' చిత్రం ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో అధికారికంగా స్ట్రీమింగ్ అవుతున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. మొదటి భాగం ఘన విజయం సాధించడంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పరాజయాన్ని చవిచూసింది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య పవర్ఫుల్ పాత్రలో నటించారు.