తొమ్మిదో తరగతి కొత్త సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకం విడుదల చేసిన ఎన్సీఈఆర్టీ
రిపోర్టర్: గోపి
స్థలం: న్యూఢిల్లీ
దేశంలోని తొమ్మిదో తరగతి విద్యార్థుల కోసం కొత్త సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకాన్ని విడుదల చేసినట్లు ఎన్సీఈఆర్టీ అధికారులు సెప్టెంబర్ 28న అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. అండర్ స్టాండింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్ పేరుతో రూపొందించిన ఈ పుస్తకం సెప్టెంబర్ 29 నుండి అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎన్సీఈఆర్టీ అధికారిక సేల్స్ ఛానెల్స్, ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ నూతన పాఠ్యపుస్తకాన్ని కొనుగోలు చేయవచ్చని వారు స్పష్టం చేశారు.