హైదరాబాద్ మెట్రోకు 60 కొత్త కోచ్‌లు.. రూ.600 కోట్లతో కొనుగోలు!

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.600 కోట్లతో 60 కొత్త కోచ్‌లను కొనుగోలు చేయనుంది. వీటితో 6 కోచ్‌ల చొప్పున 10 కొత్త రైళ్లను అందుబాటులోకి తేనున్నారు. దీని ద్వారా రోజువారీ ప్రయాణికుల సామర్థ్యం 6 లక్షలకు పెరుగుతుందని అధికారులు వెల్లడించారు.