టీఎంసీ చీలికపై ఈసీ కీలక నిర్ణయం కొత్త పేర్లు గుర్తులు కేటాయింపు
రిపోర్టర్: సునీల్
స్థలం: పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీలిక నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వర్గానికి మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పేరుతో పాటు ఫుట్ బాల్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. అలాగే రితబ్రత బెనర్జీ తిరుగుబాటు వర్గానికి డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్ పేరును ఖరారు చేసి ఎన్వెలప్ కవర్ గుర్తును కేటాయించింది. రాబోయే అక్టోబర్ 6న జరగనున్న రేజీనగర్, నందిగ్రామ్ ఉపఎన్నికల కోసం ఈ కొత్త పేర్లు, గుర్తులను ఇరు వర్గాలు ఉపయోగించాలని ఈసీ స్పష్టం చేసింది.