ఓట్ల తొలగింపు ప్రజాస్వామ్యంపై దాడి: భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఖమ్మం
ఓట్ల తొలగింపు ప్రక్రియ మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై జరుగుతున్న ప్రత్యక్ష దాడి అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనికి బాధ్యులైన వారు వెంటనే పదవుల నుంచి తప్పుకోవాలని ఆయన ఖరాఖండీగా డిమాండ్ చేశారు. ప్రజల్లో అనుమానాలకు ప్రభుత్వమే ప్రధాన కారణమని స్పష్టం చేస్తూ, దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని విపక్షాల తరఫున ఆయన గట్టిగా తేల్చిచెప్పారు.