మురసు తుపాను బీభత్సం: రాష్ట్రంలో పూర్తిగా ధ్వంసమైన వందలాది కిలోమీటర్ల రోడ్లు
రిపోర్టర్: హరి
స్థలం: అమరావతి
మురసు తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నూట అరుబై రెండు కిలోమీటర్లకు పైగా ఆర్అండ్బీ రహదారులు పూర్తిగా దెబ్బతిన్నట్లు ఆ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. అత్యధికంగా నెల్లూరు, ఎన్టీఆర్ మరియు పశ్చిమగోదావరి జిల్లాల్ లో రోడ్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయని ఆయన పేర్కొన్నారు. పలుచోట్ల నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో, వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.