ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ ఎన్నికలకు అభ్యర్థుల తుది జాబితా విడుదల

రిపోర్టర్: నరేష్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ ఎన్నికలకు అన్ని ప్రధాన విద్యార్థి సంఘాలు అభ్యర్థులను ప్రకటించాయి. సెప్టెంబర్ 18న పోలింగ్ జరగనుండగా, 19న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అధ్యక్ష పదవికి ఏడుగురు బరిలో నిలిచారు. ఏబీవీపీ తరఫున యశ్ దాబాస్, ఎన్ఎస్ యూఐ తరఫున విజయ్ శంకర్ మీనా, వామపక్ష కూటమి తరఫున అనన్య రతురి పోటీపడుతున్నారు. ఎన్నికల వేడి విశ్వవిద్యాలయ వ్యాప్తంగా విపరీతంగా పెరిగింది.