నవంబర్ 13న నూతన హంగులతో గీతాంజలి చిత్రం రీ రిలీజ్
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
అక్కినేని నాగార్జున హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ లవ్ స్టోరీ గీతాంజలి చిత్రం నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రీ రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. గతంలో వాయిదా పడిన ఈ సినిమాను తాజాగా అత్యాధునిక 4కే వెర్షన్ మరియు మెరుగైన ఆడియో క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. సుమారు 37 ఏళ్ల క్రితం విడుదలై సంచలనం సృష్టించిన ఈ విజువల్ వండర్‌ను మళ్లీ వెండితెరపై చూసేందుకు అక్కినేని అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.