అర్నబ్ తుపాను ముప్పు: అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ రాంసుందర్
రిపోర్టర్: సురేష్
స్థలం: విజయనగరం
అర్నబ్ తుపాను పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ ఆదేశించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రభుత్వ శాఖలన్నీ క్షేత్రస్థాయిలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులను ఆదేశించారు.