పాకిస్థాన్ అండర్-19 క్రికెటర్లను శరణార్థులుగా భావించి ఆందోళన చేసిన నిరసనకారులు
రిపోర్టర్: అశోక్
స్థలం: World
బ్రిటన్లోని పోర్ట్స్మౌత్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శరణార్థులుగా భావించి ఓ హోటల్ వద్ద ముసుగు ధరించిన కొందరు నిరసనకారులు ఆందోళనకు దిగారు. అయితే వారు శరణార్థులు కాదని, ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చిన పాకిస్థాన్ అండర్-19 క్రికెట్ జట్టు సభ్యులని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒకే కంపెనీకి చెందిన బస్సు కావడంతో ఈ పొరపాటు జరిగినట్లు కౌన్సిలర్ తెలిపారు. స్థానికంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్లే ఈ ఘటన చోటుచేసుకుంది.