ఖమ్మంలో బీఆర్‌ఎస్ భారీ నిరసన: కాంగ్రెస్ పాలనపై పువ్వాడ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సునీల్
స్థలం: ఖమ్మం
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్యాలను నిరసిస్తూ ఖమ్మంలో బీఆర్‌ఎస్ భారీ ర్యాలీ నిర్వహించింది. పెవీలియన్ మైదానం నుంచి అంబేద్కర్ కూడలి వరకు సాగిన ఈ నిరసనలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల విడుదలపై డిమాండ్ చేస్తూ, నిరుద్యోగులను మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు.