నెట్ఫ్లిక్స్ సంచలన నిర్ణయం: దాదాపు వెయ్యి మంది ఉద్యోగుల తొలగింపునకు ప్లాన్

రిపోర్టర్: రాము స్థలం: అమెరికా

ప్రపంచ ప్రఖ్యాత ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ వ్యాపార వ్యూహాల్లో భాగంగా దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు సంస్థ సహ-సీఈవోలు టెడ్ సరాండోస్, గ్రెగ్ పీటర్స్లు వెల్లడించారు. స్ట్రీమింగ్ రంగంలో పోటీ తీవ్రమవడం, వృద్ధి వేగం మందగించడంతో ఈ లేఆఫ్స్ విధిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. టెక్నాలజీ, ప్రొడక్ట్, హెచ్ఆర్ విభాగాలపై ఈ కోతల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.