అంటిలియాలో ఘనంగా గణపతి బాప్పా స్వాగతం పలికిన అంబానీ కుటుంబం.
రిపోర్టర్: నరేష్
స్థలం: మహారాష్ట్ర
ముంబైలోని తమ నివాసం అంటిలియాలో అంబానీ కుటుంబం గణపతి బాప్పాను ఘనంగా స్వాగతించింది. గణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా ముఖేష్ అంబానీ నివాసంలో భక్తిశ్రద్ధలతో వినాయక ప్రతిష్టను నిర్వహించారు. నీతా అంబానీ, అనంత్ అంబానీ, రాధికా అంబానీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఢోల్ వాయిద్యాలు, పూలవర్షం మధ్య గణనాథుడిని ఆహ్వానించారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.