ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఏఐ ఆధారిత బోధన
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కృత్రిమ మేధస్సు ఆధారిత పాఠాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. దిల్లీలో జరిగిన సమిట్‌లో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఐఐటీ మద్రాస్ ఏఐ ఎక్స్‌లెన్స్ సెంటర్ బోధన్ ఏఐ భాగస్వామ్యంతో పాఠశాల విద్యాశాఖ దీన్ని అమలు చేయనుంది. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 175 పాఠశాలల్లో తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు స్టూడెంట్ ట్యూటర్ బాట్‌ను పరిచయం చేయనున్నారు.