తుఫాను నష్టాలపై అధికారులతో అచ్చెన్నాయుడు సమీక్ష: రైతులకు భరోసా

రిపోర్టర్: సునీల్ స్థలం: శ్రీకాకుళం

ఆర్నాబ్ తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖలకు వాటిల్లిన నష్టాలపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ, నలుగురు శాఖల కమిషనర్లు, డైరెక్టర్లతో సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు కే అచ్చేమ్ నాయుడు శ్రీకాకుళం వెల్లడించారు. ఒక్క రైతుకూ ఎటువంటి అన్యాయం జరగకుండా క్షేత్రస్థాయిలో సమగ్ర నష్టాల అంచనా చేపట్టడంతో పాటు బాధితులకు ప్రభుత్వం తరఫున తక్షణ సాయం అందించేలా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.