ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా రాహుల్ గాంధీ పోరాటం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
రిపోర్టర్: అశోక్
స్థలం: సూర్యాపేట
దేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో ప్రతి ఒక్కరి ఓటును పరిరక్షించడం అత్యంత కీలకమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఈ ప్రచారం రాజ్యాంగ విలువల పరిరక్షణకు మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడానికి ఎంతో దోహదపడుతుందని ఆయన తెలిపారు. ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడుతూ వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి స్పష్టం చేశారు.