విద్యుత్ కోతలపై కదం తొక్కిన రైతన్న: ప్రభుత్వంపై బీఆర్ఎస్ నిప్పులు
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
వ్యవసాయానికి విద్యుత్ కోతలు విధించడాన్ని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. సాగునీరు, విద్యుత్ అందక పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆదేశాల మేరకు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.