పాన్ ఇండియా సినిమాలపై హీరో నాని ఆసక్తికర వ్యాఖ్యలు
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా టాలీవుడ్ హీరో నాని చేసిన పాన్ ఇండియా కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. సౌత్ సినిమాలకు మాత్రమే పాన్ ఇండియా అనే ట్యాగ్ ప్రత్యేకంగా ఎందుకు వినిపిస్తోందంటూ ఆయన వేసిన ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కంటెంట్ నచ్చి ఆడియన్స్ థియేటర్లకు రావడమే అసలైన విజయం అని ఆయన అభిప్రాయపడగా, ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.