రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు: ఆమ్రపాలికి కీలక బాధ్యతలు అప్పగింత

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి ఆమ్రపాలిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ వెల్లడించారు. ఆమెతో పాటు వెయిటింగ్లో ఉన్న పలువురు అధికారులకు వివిధ విభాగాలలో కొత్త పోస్టింగులు కేటాయించారు. దిల్లీలోని ఏపీ భవన్ ఓఎస్డీగా సౌరభ్గౌర్ను నియమించగా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా మురళీధర్రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.